SBI Jobs:6100 అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..?
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుడ్ న్యూస్ వచ్చింది.బ్యాంకులో ఉద్యోగం పొందాలనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి అవకాశం కల్పిస్తోంది. 6100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. 6100 అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 100 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 125 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 జూలై 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఇక పూర్తి వివరాలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 26 జూలై 2021. ఇక అర్హత వివరాలకు వస్తే... గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయస్సు 20 ఏళ్లు గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. వయస్సు విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు 1992 నవంబర్ 1 నుంచి 2020 అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి.
ఇక ఫీజు వివరాల విషయానికొస్తే.. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉండగా... ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇందులో స్థానిక భాషపై ఎంత మేరకు పట్టుందనే అంశంపై కూడా పరీక్షించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల వారికైతే తెలుగు ఉర్దూపై అవగాహనను పరీక్షిస్తారు. ఇక మెడికల్ టెస్టు కూడా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపికైతే నెలకు రూ.15వేలు వేతనం అందిస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.అంతవరకు స్టయిపెండ్ కింద నెలకు రూ.15000 ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్రెంటిస్‌లో ఇతరత్రా అలవెన్స్‌లకు అర్హులు కారు. ఇక ఆన్‌లైన్ టెస్టులో జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌లపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఒక గంట సమయంలో వీటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి.












Click it and Unblock the Notifications