SEBI 2024: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..

సెబీలో అసిస్టెంట్ మేనేజ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. మొత్తం 97 ఆఫీసర్‌ గ్రేడ్‌-ఏ పోస్టుల‌కు గాను నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ముంబైలోని స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ- సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (SEBI) భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్‌ను రీలిజ‌య్యింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 97 అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఏప్రిల్‌ 13 దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఇత‌ర సందేహాల కోసం అభ్యర్థులు ఈ https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

ఆఫీస‌ర్ గ్రేడ్ ఏ మొత్తం పోస్టులు : 97

వివిధ విభాగాల్లో ఖాళీల వివరాలు: జనరల్‌, లీగల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజీనిరింగ్‌ (ఎలక్ట్రికల్), రిసెర్చ్, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హ‌త‌లు : ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు దర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
వయ‌సు : ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. మార్చి 31 2024 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. శాల‌రీ వివ‌రాలు : నెలకు రూ.44,500- రూ.89,150 గా వేత‌నంగా ఉంటుంది.

SEBI 2024 Jobs in Securities and Exchange Board of India

ఇత‌ర వివ‌రాలు..

అభ్య‌ర్థుల ఎంపిక విధానం: ఈ పోస్టుల‌కు ఫేజ్-1, ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.అప్ల‌య్ చేయుట‌కు దరఖాస్తు రుసుము : అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్య‌ర్థుల‌కు 1000 రూపాయ‌లు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు 100 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ఈ పోస్టుల‌కు కేవ‌లం ద‌ర‌ఖాస్తులో మాత్ర‌మే అప్ల‌య్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేసుకునేందుకు ఏప్రిల్‌ 13, 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమ‌వుతాయి. పూర్తి నోటిఫికేష‌న్‌కు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+