ఎస్ఐ, ఏఎస్ఐ తుది పరీక్ష ప్రిలిమినరీ కీ రేపే విడుదల: 14 వరకు అభ్యంతరాలకు ఛాన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించిన ఎస్ఐ, ఏఎస్ఐ తుది పరీక్షల ప్రిలిమినరీ కీ గురువారం(మే 11న) విడుదల కానుంది. ఈ మేరకు వివరాలను పోలీసు నియామక బోర్డు(TSLPRB) ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రిలిమినరీ కీ మే 11న టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 14వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు తెలపవచ్చని తెలిపారు. అయితే, ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు ఆధారాలు నిర్ణీత నమూనాలో సమర్పించాలని పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు.
ఎస్ఐ ఐటీ అండ్ సీవో టెక్నికల్ పేపర్, ఏఎస్ఐ ఎఫ్‌పీబీ పేపర్ల(ఆబ్జెక్టివ్ టైప్) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్ఐ పీటీవో పరీక్షను మార్చి 26, అరిథిమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ పేపర్లను ఏర్పిల్ 8న, జనరల్ స్టడీస్ పేపర్ల ఫైనల్ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 9న నిర్వహించిన విషయం తెలిసిందే.

ఎస్ఐ, ఏఎస్ఐ తుది పరీక్ష ప్రిలిమినరీ కీ, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ సంప్రదించవచ్చు.
గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం 15 వరకు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్ 4కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 8180 గ్రూప్-4 పోటీస్లుకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 30 నుంచి ఈ ఏడాది జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఈ క్రమంలో గ్రూప్-4 పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు తాజాగా, టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.
మే 9వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు మరోసారి అవకాశం ఉండదని.. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది.
కాగా, మొత్తం 8180 గ్రూప్-4 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ నెలకొనడంతో స్థానికతతోపాటు విద్యార్హతలు, కుల ధృవీకరణ వంటి పలు అంశాలు నియామక ప్రక్రియలో కీలకం కానున్నాయి. అందువల్ల దరఖాస్తు సమయంలో దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు తాజాగా టీఎస్ పీఎస్సీ అవకాశం ఇచ్చింది. ఇక, తెలంగాణ గ్రూప్-4 పరీక్ష జులై 1న జరగనుంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications