Madhopatti: దేశాభివృద్ధిలో ఓ పల్లెటూరు కీలకపాత్ర.. గ్రామం చిన్నదే కానీ సెల్యూట్ చేయాల్సిందే
UPSC factory: మనకు వివిధ రకాల ఫ్యాక్టరీలు తెలుసు. మరి UPSC ఫ్యాక్టరీ తెలుసా. అవును ఇది నిజమే. ఎందుకంటే ఆ ఊరిలో అధికశాతం మంది దేశంలోనే అత్యంత క్లిష్టతరమైన పరీక్షగా చెప్పే UPSCని క్లియర్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని వివిధ శాఖలతో పాటు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల వద్ద కూడా పలు హోదాల్లో పనిచేస్తున్నారు. అందుకే ఆ గ్రామాన్ని IAS, IPSలను తయారుచేసే ఫ్యాక్టరీగా ముద్దుగా పిలుచుకుంటారు.
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్షలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూవత్ భారతాన్ని ముందుండి నడిపించే IAS, IPS, IFSతో పాటు ఇతర అతిముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు UPSC ఎగ్జామ్స్ రాసేందుకు హాజరవుతారు.

ఇంత ప్రాముఖ్యత ఉన్న పరీక్షకు, ఓ చిన్న గ్రామానికి అవినాభావ సంబంధం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన మాధోపట్టి అనే గ్రామం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు జన్మస్థానంగా మారింది. కేవలం 75 ఇళ్లు ఉండే ఈ గ్రామం 40 మందికిపైగా IAS, IPS మరియు ICS ఉద్యోగులను దేశానికి అందించింది. అంటే దాదాపు ప్రతి రెండిళ్లకు ఓ సివిల్ సర్వెంట్ అన్నమాట. ఇక్కడ 4 వేల మంది నివసిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే కేవలం ఆ ఊరికి చెందిన పురుషులు మాత్రమే కాకుండా గ్రామంలోని కూతుళ్లు, కోడళ్లు కూడా సివిల్ సర్వీసెస్‌లో తమదైన ముద్రవేశారు. కళాశాలలో చేరినప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలనే తపనతో UPSCకి ప్రిపేర్ అవుతారని గ్రామస్థులు చెబుతున్నారు. తద్వారా తమ కుటుంబాలు గర్వపడేలా చేయడమే కాకుండా గ్రామానికి మంచి గుర్తింపు తెస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications