Jobs: నల్గొండ ఐటీ టవర్ లో 200 ఉద్యోగాలు.. ప్రకటించిన సొనాటా సాఫ్ట్ వేర్..
ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ అయిన సొనాటా సాఫ్ట్‌వేర్ తెలంగాణలోని టైర్-II పట్టణాల్లో తమ కంపెనీలను విస్తరిస్తోంది. నల్గొండ IT టవర్‌లో 200 ఉద్యోగాలను కల్పించడం ద్వారా త్వరలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ మేరకు Sonata సాఫ్ట్‌వేర్ ఈవీపీ శ్రీని వీరవెల్లి ప్రకటన చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్‌పై దృష్టి సారిస్తూ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ వంటి విస్తృత శ్రేణి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలపై పని చేయడానికి తమ సంస్థ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
సొనాటా సాఫ్ట్‌వేర్ ఎండ్-టు-ఎండ్ ఇండస్ట్రీ-ఫోకస్డ్ సొల్యూషన్‌లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంపై పని చేస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కంపెనీని విస్తేరించేందకు ప్రయత్నాలు చేస్తోంది. కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి పాల్గొన్నారు.

గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సనోఫీ నాయకత్వ బృందం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమ ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు వివరించింది. కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో 350 ఉద్యోగాలతో కేంద్రాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రం తమ గ్లోబల్ 'టాలెంట్ హబ్స్'లో ఒకటని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో సనోఫీ గ్లోబల్ హబ్‌ను ఏర్పాటు చేయడం మన విస్తృత లైఫ్ సైన్సెస్ వ్యూహాన్ని మరింతగా పెంచుతుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే 'హెల్త్ టెక్ మక్కా'గా అవతరించేందుకు కృషి చేస్తున్న హైదరాబాద్ నాయకత్వ పాత్రలో ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కేటీఆర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాల్లో పర్యటిస్తున్నారు. కేటీఆర్ తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సీఈవో శక్తి ఎం నాగప్పన్ ఉన్నారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications