South Indian Bankలో పీఓ పోస్టులు: అర్హతలు చివరితేదీ ఇదే..!!

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..మంచి బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారా.. అలాంటి వారికోసం సౌత్ ఇండియన్ బ్యాంకు గుడ్ న్యూస్ తెలిపింది. సౌంత్ ఇండియన్ బ్యాంకు ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు ఇలా ఉన్నాయి.

సౌత్ ఇండియన్ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఐబీఏ ప్రకారం వేతనం ఉంటుంది.నెలకు36,000 - 1,490/7 - 46,430 - 1,740/2 - 49,910 - 1,990/7 - 63,840 చెల్లించడం జరుగుతుంది. సౌత్ ఇండియన్ బ్యాంకు ప్రొబేషనరీ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలని భావిస్తున్నవారు విద్యార్హతలతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి.

గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 50 శాతం మార్కులతో రెగ్యులర్ కోర్సుగా డిగ్రీ కలిగి ఉండాలి. అదే సమయంలో ఏదైనా కమర్షియల్ బ్యాంకు/అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు/స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు/బ్యాంకింగ్ సబ్సిడరీలో రెండేళ్ల పాటు పని అనుభవం కలిగి ఉండాలని సౌత్ ఇండియన్ బ్యాంకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

South Indian Bank Recruitment 2021: Apply for PO posts

సౌత్ ఇండియన్ బ్యాంకులో పీఓ పోస్టులకు అప్లయ్ చేసే వారి వయస్సు గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలని స్పష్టం చేసింది. 1993 ఆగష్టు 1కి ముందు 2003 జూలై 31 తర్వాత అభ్యర్థి జన్మించి ఉండరాదు. ఇక అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష ద్వారా జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సౌత్ ఇండియన్ బ్యాంకు పీఓ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు రూ.800 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్ ద్వారానే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది.

సౌత్ ఇండియన్ బ్యాంకు పీఓ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ముఖ్య తేదీలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్ విడుదల తేదీ: 1 సెప్టెంబర్ 2021
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 1 సెప్టెంబర్ 2021
ఆన్‌లైన్ అప్లికేషన్‌ పూర్తి చేసేందుకు చివరితేదీ: 8 సెప్టెంబర్ 2021

ఇంకెందుకు ఆలస్యం.. అన్ని అర్హతలు ఉండి మంచి జీతం పొందాలనుకుంటే వెంటనే అప్లయ్ చేయండి. చివరి నిమిషంలో అప్లయ్ చేయాలనుకుంటే సర్వర్ బిజీగా ఉండటం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోవచ్చు. ఇక పూర్తి వివరాలకు www.southindianbank.com

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+