సదరన్ రైల్వేలో 3వేలకుపైగా ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: భారత రైల్వేలోని సదరన్ రైల్వే విభాగం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 3154 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం అర్హులు, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు స్వీకరణకు అక్టోబర్ 31తో గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగాలు:
3154 అప్రెంటీస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్, లక్ష్వదీప్ ఐలాండ్, కర్ణాటక, తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్టీ, కార్పొంటర్, మెషినిస్ట్, వైర్‌మెన్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు 15-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్, అకాడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 31, 2022 చివరితేదీగా నిర్ణయించారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://sr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications