Job news:కేంద్ర హోంశాఖలో ఎస్ఐ-స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: అర్హతలు ఇవే..!
కేంద్ర ప్రభుత్వ పరిధిలో పోలీసుశాఖ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్రహోంశాఖ కింద ఉన్న సశస్త్ర సీమా బల్(SSB)లో సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పైనీర్, డ్రాట్స్‌మెన్, కమ్యూనికేషన్ అండ్ స్టాఫ్ నర్స్ పోస్టులను గ్రూ-బి నాన్ గెజిటెడ్ మరియు నాన్ మినిస్టేరియల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
SSB రిక్రూట్‌మెంట్ 2021కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి 30 రోజుల సమయంలోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssbrectt.gov.inను సందర్శించి నోటిఫికేషన్ చూడాలి. అయితే అంతకంటే ముందుగా ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్లో ఉద్యోగ ప్రకటన వస్తుంది. ఆ తర్వాతే అర్హులైన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పూర్తి చేయాలి.

ఇక ఎస్ఎస్‌బీ ఎస్ఐ రిక్రూట్‌మెంట్ 2021కు సంబంధించి వేకెన్సీలు, విద్యార్హతలు, వయస్సు, వేతనం వంటి అంశాలు ఇలా ఉన్నాయి.
SI- 116 పోస్టులు
1. ఎస్‌ఐ (పైనీర్) - 18 పోస్టులు
2. ఎస్‌ఐ (డ్రాట్స్‌మెన్) - 3 పోస్టులు
3. ఎస్‌ఐ ( కమ్యూనికేషన్) - 56 పోస్టులు
4. ఎస్‌ఐ ( స్టాఫ్ నర్స్ మహిళలు మాత్రమే) - 39 పోస్టులు
ఎస్‌ఎస్‌బీ వేతనం: పే లెవెల్ 6- నెలకు రూ.35400 -1,12400
విద్యార్హతలు:
1. ఎస్‌ఐ (పైనీర్) - సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా
2. ఎస్‌ఐ (డ్రాట్స్‌మెన్) - 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికేట్-ఆటోక్యాడ్‌పై ఒక ఏడాది అనుభవం తప్పనిసరి
3. ఎస్‌ఐ ( కమ్యూనికేషన్) -ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఫిజిక్స్-మ్యాథ్స్-కెమిస్ట్రీలలో సైన్స్ డిగ్రీ
4. ఎస్‌ఐ ( స్టాఫ్ నర్స్ మహిళలు మాత్రమే) - 10+2 మరియు జనరల్ నర్సింగ్‌లో డిప్లొమా
వయస్సు : 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ : రూ.200/-
ఎస్సీ/ఎస్టీ/మహిళళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు
మరిన్ని వివరాలకు.. లేదా దరఖాస్తు చేసుకునేందుకు ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: ssbrectt.gov.in












Click it and Unblock the Notifications