ఇంట‌ర్ అర్హ‌త‌తో ఎస్ఎస్‌సి మ‌రో నోటిఫికేష‌న్‌... ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా!

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న‌ వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టుల భర్తీకి ఎస్ఎస్‌సి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంట‌ర్ అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 2006 స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల‌కు ఎస్ఎస్‌సి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఈ ఉద్యోగాల‌కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హ‌త‌, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ‌చ్చే నెల (ఆగస్టు) 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగ‌ల‌రు.

మొత్తం పోస్టుల సంఖ్య: 2,006

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్)
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)

విద్యార్హ‌త‌

ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునేవారు ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత క‌లిగి ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం క‌లిగి ఉండాలి.

SSC Another Notification with Inter Eligibility Apply

వయసు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు 01-08-2024 నాటికి 18-30 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి. గ్రేడ్- డి పోస్టులకు అప్ల‌య్ చేయాల‌నుకునేవారు 18-27 ఏళ్లు మించకుండా ఉండాలి. వివిధ కేటగిరీలు క‌లిగిన వారికీ వయో సడలింపు వ‌ర్తిస్తుంది. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ప‌రీక్షా విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. అబ్జెక్టివ్ విధానంలోనే ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్రశ్నలు ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లోనే ఉంటాయి. పరీక్ష స‌మ‌యం 2 గంటలు ఉంటుంది. మొత్తం 200 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష ఉంటుంది. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునే అభ్య‌ర్థులు రూ. 100 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వ‌ర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలివే..

ఆన్‌లైన్ దరఖాస్తు స‌మ‌ర్పించు తేదీలు: 26.07.2024 నుంచి 17.08.2024 వరకు
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు 17.08.2024 చివరి తేదీగా నిర్ణ‌యించ‌డ‌మైన‌ది.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు 18.08.2024 చివరి తేదీగా నిర్ణ‌యించ‌డ‌మైన‌ది.
దరఖాస్తు సవరణ : 27.08.2024 నుంచి 28.08.2024 చేసుకోవ‌చ్చు.
ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫ‌ర్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: అక్టోబర్/ నవబర్‌, 2024

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+