SSC CGL: ఎస్ఎస్‌సి అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. సిజిఎల్ 2024 అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌..

ఎస్ఎస్‌సి అభ్య‌ర్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక.. ఎస్ఎస్‌సి సిజిఎల్ టైర్ I పరీక్షకు 2024 సంబంధించిన అడ్మిట్ కార్డులు తాజాగా విడుద‌ల‌య్యాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు త‌మ హాల్‌టిక్కెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024లో హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ లేదా పేరుతో పాటు పుట్టిన తేదీ న‌మోదు చేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల (సెప్టెంబర్) 9వ తేది నుండి సెప్టెంబర్ 26, 2024 వరకు నిర్వహించనున్నారు. సీజీఎల్ టైర్ I పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వంటి సబ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఇందులోని ప్ర‌తి విభాగం నుంచి 25 ప్ర‌శ్న‌లు అడుగుతారు.
వీటికి 50 మార్కులు ఉంటాయి. SSC CGL టైర్-I పరీక్షలు సిబిటి విధానంలో నిర్వ‌హిస్తారు. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ప్ర‌శ్న‌లు మినహా మిగిలిన అన్ని ప్రశ్నలు ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్క్‌లు ఉంటాయి.

SSC CGL Alert for SSC Candidates CGL 2024 Admit Cards Released

ఇవి త‌ప్ప‌నిస‌రి..

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ 17,727 సీజీఎల్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప‌రీక్ష‌కు సంబ ంధించిన అడ్మిట్‌కార్డుల‌ను ఎస్ఎస్‌సి విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమతో పాటు SSC CGL 2024 అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పాటు ఫోటోను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం అడ్మిట్‌కార్డు కోసం అభ్యర్థులు ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించ‌గ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+