SSC: నిరుద్యోగులకు శుభవార్త.. 5369 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఫీజు రూ.100లే..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 11 కింద 5369 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ - ssc.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అకౌటెంట్, రీసెర్చి ఇన్వెస్టిగేటర్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ సహా మొత్తం 5,369 ఉద్యోగాలకు మార్చి 6 నుంచే దరఖాస్తులు ఆహ్వానిచ్చింది. 27 మార్చి 2023 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
SSC జూన్ లేదా జూలై 2023 నెలలో దేశవ్యాప్తంగా SSC ఎంపిక పోస్ట్ 11వ దశ 2023 పరీక్షను నిర్వహిస్తుంది.పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో కూడిన కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలకు 50 మార్కులు); జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 50 మార్కులు); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు 50 మార్కులు), ఇంగ్లిష్ (25 ప్రశ్నలు 50 మార్కులు) చొప్పున ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగెటి మార్కులు కూడా ఉంటాయి.

ఆయా ఉద్యోగాలకు ఉన్న విద్యా అర్హత బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. సమర్పించిన దరఖాస్తులో తప్పులుంటే ఏప్రిల్ 3 నుంచి 5 వరకు సవరించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంది. పరీక్ష ఫీజు రూ. 100 ఉంటుంది. ఈ పరీక్ష పీజును యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.












Click it and Unblock the Notifications