Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TCS Recruitment Drive : మహిళా ప్రొఫెషనల్స్‌కు టీసీఎస్ బంపరాఫర్-'రీబిగిన్'తో ఉద్యోగావకాశాలు..

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీస్) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను లాంచ్ చేసింది. 'రీబిగిన్' పేరుతో చేపట్టనున్న ఈ డ్రైవ్ ద్వారా పెద్ద ఎత్తున మహిళా ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకోనున్నారు.ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన మహిళా నిపుణులకు స్పూర్తినిచ్చేలా,తమను తాము మళ్లీ ఆవిష్కరించుకునేలా,తమను తాము ఛాలెంజ్ చేసుకునేలా ఈ కొత్త అవకాశాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతాయని టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

వ్యక్తిగత కారణాలు లేదా వృత్తిపరమైన కారణాలతో సుదీర్ఘ కాలం జాబ్‌కు దూరంగా ఉన్న మహిళా నిపుణులకు 'రీబిగిన్' చక్కని అవకాశమని టీసీఎస్ తెలిపింది. కనీసం రెండేళ్ల పాటు మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా ఐటీ రంగంలో పనిచేసిన మహిళలు 'రీబిగిన్' ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకునేందుకు అర్హులని వెల్లడించింది. ఔత్సాహిక అభ్యర్థులు ఫుల్ టైమ్ డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలని తెలిపింది.

'ప్రతిభ కలిగినవారు... ఎవరైతే తమ స్కిల్స్‌తో ప్రపంచాన్ని మార్చగలమని విశ్వసించేవారిని టీసీఎస్ ప్రోత్సహిస్తుంది. మీరూ అందులో ఒకరైతే... ఔత్సాహికులైన ప్రతిభావంతులను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం.ప్రతిభ,సామర్థ్యం మనలో ఎప్పుడూ ఉంటాయి. రీబిగిన్‌తో ఆ ప్రతిభను మరోసారి చాటుకునే అవకాశం కల్పిస్తున్నాం.' అని టీసీఎస్ పేర్కొంది.

tcs rebegin biggest recruitment drive to hire women professionals

టీసీఎస్ రీబిగిన్ ప్రోగ్రామ్‌కు ఎలా అప్లై చేయాలంటే :

Step 1 : అర్హత గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Step 2 : రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలతో సైట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.

Step 3 : పేజీని సందర్శించి జాబ్‌కు అప్లై చేయాలి.

ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే... టీసీఎస్ టెక్ కంపెనీ కాబట్టి ఎక్కువగా సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి సాఫ్ట్‌వేర్ పట్ల మంచి పట్టు ఉన్నవారు అప్లై చేసుకుంటే మంచి కెరీర్‌ దొరుకుతుంది.

ఈ ఏడాది జూన్‌లో టీసీఎస్ 20వేల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. ఒక త్రైమాసికంలో ఇప్పటివరకూ ఇదే భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్. 2022 ఆర్థిక సంవత్సరంలోనూ భారీ రిక్రూట్‌మెంట్స్ ఉంటాయని... దాదాపు 40వేల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని టీసీఎస్ వెల్లడించింది. 5లక్షల మంది ఉద్యోగులతో టీసీఎస్ టెక్ కంపెనీ యాజమాన్యాల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఆక్సెంచర్(5.37లక్షలు) ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+