Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fresher jobs: ఉద్యోగావకాశాలపై టీమ్‌ లీజ్ విశ్లేషణ.. ఫ్రెషర్లను ఆదుకుంటుంది ప్రధానంగా ఆ రంగమే

FMCG sector: పిల్లలు మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడాలనే ఆశయంలో తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. అయితే ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కొలువు సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న మాంద్యం, యుద్ధాల భయం వల్ల కొత్త ఉద్యోగాల సంగతి పక్కనపెడితే, ఉన్న సిబ్బందినే లేఆఫ్స్ ఇచ్చి ఆయా కంపెనీలు బయటకు పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో FMCG రంగం ఆశాకిరణంలా కనిపిస్తోంది.

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలో ఫ్రెషర్స్‌ డిమాండ్ గణనీయమైన వృద్ధిని కనబరిచింది. 2024 ప్రథమార్థంలో ఇది 27 శాతం ఉండగా, ద్వితీయార్థంలో 32 శాతానికి చేరుకుంది. జూలై-డిసెంబర్ మధ్య డేటాను విశ్లేషించిన టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ కెరీర్ అవుట్‌లుక్ ఈ వృద్ధిపై కీలక రిపోర్టును రిలీజ్ చేసింది. మార్కెట్ పై అవగాహన, రిటైల్ పంపిణీ, లోకల్ వినియోగదారుల ప్రవర్తనకు సంబంధించి నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లను నియమించుకోవడంపై FMCG కంపెనీలు దృష్టి పెట్టుతున్నట్లు వెల్లడించింది.

Team Lease report revealed that FMCG sector standing for freshers employment

ప్రాంతాల ఆధారంగా ఆయా రోల్స్‌కు డిమాండ్ ఏర్పడినట్లు టీమ్‌లీజ్ తన నివేదికలో తెలిపింది. ఫుడ్ ఇంజినీర్ల నియామకానికి బెంగళూరులో 41 శాతం, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లకు ఢిల్లీలో 39 శాతం, సరఫరా మరియు పంపిణీ విభాగానికి హైదరాబాద్‌లో 37 శాతం మేర డిమాండ్ ఉన్నట్లు చెప్పింది. ఇక బ్రాండ్ మేనేజ్‌మెంట్ ట్రైనీలకు బెంగళూరులో 34 శాతం మంచి అవకాశాలున్నాయని వివరించింది.

పాల ఉత్పత్తులు, రెడీ-టు-ఈట్ (RTE) ఫుడ్, ఫ్రోజెన్ మాంసం, స్నాక్స్ వంటి ఉత్పత్తులు సరఫరా చైన్ నిర్వహణ మరియు మార్కెట్ రీసెర్చ్‌లో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాయని టీమ్‌లీజ్ స్పష్టం చేసింది. ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఫ్రెషర్లు సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ సప్లై మేనేజ్‌మెంట్ (CPSM), సర్టిఫైడ్ లాజిస్టిక్స్ అసోసియేట్ (CLA), బ్రాండ్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, మరియు లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ మైనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో సర్టిఫికేషన్ పొందాలని ప్రోత్సహిస్తోంది.

నివేదిక ప్రకారం.. ఈ రోల్స్ సాంకేతిక నైపుణ్యాలతో పాటు విభిన్న ప్రాంతీయ మార్కెట్ల అవసరాలకు తగిన సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా కోరుతున్నాయి. గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో విస్తరించిన మార్కెట్ ను చేరుకోవడం వ్లల దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ కారణాల వ్లల FMCG విభాగం ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రధాన రంగంగా నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+