తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక జాబితాను వెల్లడించింది. పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2884 మంది మహిళలు ఉన్నారు.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 5 ఉదయనికల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసు పెండింగ్ అంశాల నేపథ్యంలో పీటీవోలో 100 డ్రైవర్ పోస్టులు, డీఆర్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో నోటిఫై చేసిన 225 ఖాళీలకు సంబంధించి ఎంపికైన వారి వివరాలను విడదుల చేయనున్నట్లు తెలిపింది.

ఎంపికైన అభ్యర్థుల పూర్తి ఫలితాలు, కటాఫ్ మార్కులు (ఎంపికైన తుది అభ్యర్థుల మార్కులు పుట్టిన తేదీ వివరాలతో) గురువారం ఉదయనికల్లా అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది.
రాష్ట్రంలో ఖాళీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ స్వీకరించి, విడతల వారీగా పరీక్షలు నిర్వహించింది.












Click it and Unblock the Notifications