తెలంగాణ సీపీగెట్ 2024పరీక్షల షెడ్యూల్ విడుదల..
తెలంగాణ సీపీగెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్ పరీక్షలను నిర్వహిస్తోంది. తాజాగా , ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 6వ తేదీ నుంచి సీపీగెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూలై 17వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి.
రాష్ట్రంలోని మొత్తం 297 పీజీ కాలేజీల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనున్నాయి. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్తులు అధికారిక వెబ్‌సైట్‌ను www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in సంప్రదించగలరు.

టీఎస్ సీపీగెట్ పరీక్షల కోసం మే 18 నుంచి జూన్ 17 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించిన సంగతి తెలిసిందే. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 25వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న పీజీ కళాశాలల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతా సాధించి ఉండాలి. ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.
పరీక్షా విధానం...
సీపీగెట్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఈ ఏడాది ఉస్మానియా వర్శిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరగనున్నయి. ప్రశ్నాపత్రంలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది.
కోర్సుల వివరాలివే..!
ఎంఈడీ (MEd), ఎంఏ (MA), ఎంఎల్ఐఎస్సీ (MLISC), ఎంఎస్‌డబ్ల్యూ (MSW), ఎంహెచ్ఆర్‌ఎం (MHRM), ఎంటీఎం (MTM), ఎంకామ్ (MCom), ఎంపీఈడీ (MPEd), ఎంఎస్సీ (MSc), ఎంబీఏ (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్)












Click it and Unblock the Notifications