Telangana : డీఎస్సీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది..వ‌చ్చే నెల 18 నుంచి ప‌రీక్ష‌లు..

తెలంగాణ డీఎస్సీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది. వ‌చ్చే నెల 18వ తేది నుంచి ఆగ‌స్టు 5వ తేది వ‌ర‌కు టిఎస్ డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరి 28వ తేదిన తెలంగాణ‌ విద్యాశాఖ 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల‌కు సంబంధించిన దరఖాస్తు ప్ర‌క్రియ ఈ నెల 20తో ముగిసింది.

ఈ పోస్టులకు మొత్తం 2.79 లక్షల మంది అభ్య‌ర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా, తెలంగాణ విద్యాశాఖ అధికారులు డీఎస్సీ ప‌రీక్షల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొద‌టిసారిగా కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Telangana DSC exam schedule has come exams from 18th of next month

మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల్లో ఎస్జీటీలు 6,508 ఉండ‌గా, స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల తేదీలివే..

జులై 18న మొదటి షిప్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిప్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.

జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జిటి) పరీక్ష

జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు

జులై 22వ తేదీన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష

జులై 23వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష

జులై 24వ తేదీన స్కూల్ అసిస్టెంట్ - బయలాజికల్ సైన్స్ పరీక్ష

జులై 25వ తేదీన స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు

జులై 26వ తేదీన తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 30వ తేదీన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

ఆగస్టు 5వ తేదీ వరకు మిగతా పరీక్షలు జ‌ర‌గ‌నునున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+