తెలంగాణ EAPCET 2025 షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణ EAPCET 2025 షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.
ఈ మేరకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నతవిద్యామండలి పేర్కొంది. ఈసారి పరీక్షను JNTU-H నిర్వహిస్తోంది.













Click it and Unblock the Notifications