తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చరల్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షల షెడ్యూల్‌ను జేఎన్టీయూ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఉన్నత విద్యామండలి అధికారులు తేల్చి చెప్పారు.

ఈఏపీసెట్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణ వెల్లడించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరుగుతుందని, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

Telangana EAPSET exam schedule released

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణ వెల్లడించారు.

అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది హాజరు కానున్నట్లు బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఫార్మా, అగ్రికల్చర్‌ స్టూడెంట్స్‌ శనివారం (ఏప్రిల్‌ 19) నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు ఏప్రిల్ నెల 22 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగానికి హైదరాబాద్ జోన్ 3లో అధికంగా 50,149 మంది, నిజామాబాద్ జోన్‌లో అత్యల్పంగా 1,650 మంది పరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్నట్లు వివరించారు.

21 నుంచి ఎంబీఏ ఇంటర్నల్ పరీక్షలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంబీఏ ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదీ నిర్వహించాలని బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ రెండవ ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కాలేజీల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. కళాశాలల యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+