తెలంగాణలో మరో 2391 ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ సిద్ధమైంది. రాష్ట్రంలో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ సిద్ధమైంది. రాష్ట్రంలో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ఖాళీ పోస్టులను టీఎస్ పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యా సంస్థ భర్తీ చేయనుంది.
In yet another good news to aspirants, Telangana government accorded permission to fill 2,391 posts in various departments through TSPSC, MHSRB & TREIRB.
— Harish Rao Thanneeru (@BRSHarish) January 27, 2023
TS govt under the leadership of #CMKCR garu serving & fulfilling promises made to the people.
Best wishes to the aspirants💐 pic.twitter.com/npj8JTEEUu
బీసీ గురుకులాల్లో మొత్తం 1499 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతిచ్చింది.

ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. చాలా ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. గ్రూప్-3 నోటిఫికేషన్ల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలో ముగియనున్నాయి. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications