Telangana: నిరుద్యోగులకు తీపికబురు, గ్రూప్-2,3,4లలోకి మరిన్ని పోస్టులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపికబురు తెలిపింది. ఇప్పటికే గ్రూప్ సర్వీసుల్లో పోస్టుల భర్తీపై ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గ్రూప్-2,3,4లో మరికొన్ని రకాల పోస్టులను చేర్చింది.
ఆ వివరాలు పరిశీలించినట్లయితే..గ్రూప్-2లో మరో ఆరు రకాల పోస్టులు చేర్చింది. వాటిలో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్ఓ పోస్టులు, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు చేర్చింది.

గ్రూప్-3లో మరో రెండు రకాల పోస్టులు కలిపింది. వాటిలో గిరిజన సంక్షేమ అకౌంటెంట్, హెచ్ఓడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, హెచ్ఓడీల్లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.
గ్రూప్-4లో మరో 4 రకాల పోస్టులు చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. వాటిలో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చింది.












Click it and Unblock the Notifications