తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ఆరో నుంచే

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC).. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. అక్టోబర్ 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించవచ్చని పేర్కొంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Telangana Group 1 Mains Hall Tickets can be downloaded from October 14

అభ్యర్థులకు సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మందికిపైగా హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫలితాలను విడుదల చేశారు.

కాగా, గ్రూప్ 1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 3 గంటల వ్యవధిలో 150మార్కులకు నిర్వహిస్తారు.

పరీక్షల షెడ్యూల్ ఇలా..

అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ )
22న పేపర్-1 (జనరల్ ఎస్‌ఏ)
23న పేపర్-2 (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
24న పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్)
25న పేపర్ -4 (ఎకానమీ, డెవలప్మెంట్)
26న పేపర్- 5 (సైన్స్ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇన్టర్ప్రెటేషన్
27న పేపర్‌-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)

మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్ తప్ప, మిగిలిన పేపర్లను అభ్యర్థలు ఎంచుకున్న భాషలో రాయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+