తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC).. గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలకు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళలన వ్యక్తం చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ కు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. 783 గ్రూప్ 2 పరీక్షలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్షల ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
కాగా, జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1 పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తామని, గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్‌లో, గ్రూప్-3 పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిపికేషన్లు విడుదలై ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష నిర్వహించి మెయిన్స్‌కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications