తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు కీలక అప్‌డేట్
గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేగాక, అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్లో 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

ఆ తరువాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మధ్యాహ్నం సెషన్‌కు 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు.
వరంగల్ ఎన్ఐటీలో ఉద్యోగాలు
వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన 56 బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరింది.
గ్రూప్-ఎ: ప్రిన్సిపల్ సైంటిఫిక్/టెక్నికల్
ఆఫీసర్:
ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్: 01
డిప్యూటీ రిజిస్ట్రార్: 01
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01
అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01
గ్రూప్-బీ
అసిస్టెంట్ ఇంజినీర్: 03
సూపరింటెండెంట్: 05
జూనియర్ ఇంజినీర్: 03
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01
స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్: 01
గ్రూప్- సీ:
సీనియర్ అసిస్టెంట్ : 08
జూనియర్ అసిస్టెంట్: 05
ఆఫీస్ అటెండెంట్: 10
ల్యాబ్ అసిస్టెంట్: 13
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎమ్మెల్సీ, ఎంసీతో పాటు పని అనుభవం.
వయో పరిమతి: 56 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:
గ్రూప్-ఎ పోస్టులకు రూ. 1000
గ్రూప్ -బీ, గ్రూప్-సీ పోస్టులకు రూ. 500.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు మినహాయించారు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీళన ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07/01/2025
వెబ్‌సైట్: https://careers.nitw.ac.in/
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications