తెలంగాణ గురుకులాల్లో 868 లెక్చరర్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి, మంచి జీతం

హైదరాబాద్: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల డిగ్రీ కాలేజీల్లో డైరెక్ట్ ప్రాతిపదికన 868 డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ-రిక్రూట్‌మెంట్ బోర్డ్.

తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, జియోలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్, జర్నలిజం తదితర సబ్జెక్టుల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్/స్లైట్/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

gurukula degree college

అభ్యర్థుల వయస్సు జులై 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
పోస్టులకు తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 17,2023 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 600లు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 58,850-1,37,050ల వరకు జీతంగా చెల్లిస్తారు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు: 39 పోస్టులు
లైబ్రేరియన్ పోస్టులు: 36 పోస్టులు

డిగ్రీ లెక్చరర్ సబ్జెక్టు వారీగా పోస్టులు:

తెలుగు సబ్జెక్టు పోస్టులు: 55
ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు: 69
మ్యాథ్స్‌ సబ్జెక్టు పోస్టులు: 62
స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టు పోస్టులు: 58

ఫిజిక్స్ సబ్జెక్టు పోస్టులు: 46
కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 69
బోటనీ సబ్జెక్టు పోస్టులు: 38
జువాలజీ సబ్జెక్టు పోస్టులు: 58
కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు పోస్టులు: 99
జియాలజీ సబ్జెక్టు పోస్టులు: 6
బయో కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 3
బయో టెక్నాలజీ సబ్జెక్టు పోస్టులు: 2

హిస్టరీ సబ్జెక్టు పోస్టులు: 28
ఎకనామిక్స్ సబ్జెక్టు పోస్టులు: 25
పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు పోస్టులు: 27
కామర్స్‌ సబ్జెక్టు పోస్టులు: 93
జర్నలిజం సబ్జెక్టు పోస్టులు: 2
సైకాలజీ సబ్జెక్టు పోస్టులు: 6
మైక్రోబయాలజీ సబ్జెక్టు పోస్టులు: 17
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు పోస్టులు: 9
సోషియాలజీ సబ్జెక్టు పోస్టులు: 7
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు పోస్టులు: 14

దరఖాస్తులు ప్రారంభ తేదీ ఏప్రిల్ 17, 2023
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 17, 2023

పోస్టులకు మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://treirb.telangana.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+