తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు: 21 నుంచి దరఖాస్తు చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో 50 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అనర్హులు. వృత్తిపరమైన నైపుణ్యాలను దరఖాస్తులో పేర్కొనాలి.
వయోపరిమితి: 11-01-2023 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ/ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ. 600 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 400)
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 21-01-2023
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11-02-2023.
కంప్యూటర్ ఆధారిత/ఓఎమ్మార్ పరీక్ష తేదీ: మార్చి 23, 2023.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications