తెలంగాణ జూనియర్ లెక్చరర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల: రేపే ఆ 4 పరీక్షల ‘కీ’లు కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
సెప్టెంబర్ 29న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, హిస్టరీ, సంస్కృతం.. అక్టోబర్ 3న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఉర్దూ పరీక్షలు జరుగుతాయని, ఒక అభ్యర్థి రెండు పరీక్షలకు దరఖాస్తు చేస్తే వేర్వేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

23న జేఎల్ రాత పరీక్ష కీ విడుదల
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ (Junior lecturer) నియామకాలకు సంబంధించి నిర్వహించిన నాలుగు రాత పరీక్షల 'కీ'లు సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సెప్టెంబర్ 12, 13, 14వ తేదీల్లో జరిగిన జనరల్ స్టడీస్/ మెంటల్ ఎబిలిటీ(పేపర్-1), ఇంగ్లీష్/బోటనీ/ఎకనామిక్స్/ మ్యాథ్స్/(పేపర్-2) పరీక్షల కీ లను సెప్టెంబర్ 23న విడుదల చేసి.. అక్టోబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనుంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 జూనియర్ లెక్చరర్ నియామక రాత పరీక్షలు సెప్టెంబర్ 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షలు అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజులపాటు జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications