తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల..!
తెలంగాణలో న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ (LAWCET) మరియు పీజీ ఎల్‌సెట్ (PGLCET) 2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. జూన్ 6న రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా అభ్యర్ధులు తమ ఫలితాలను https://lawcet.tgche.ac.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలానే తమ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన రోజు తేదీ అవసరం అవుతోంది.

ఈ సంవత్సరం మొత్తం 57,715 మంది అభ్యర్థులు లాసెట్‌కు దరఖాస్తు చేసుకోగా, 45,609 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 32,118 మంది.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు కలిపి 13,491 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పీజీ ఎల్‌సెట్ (ఎల్‌ఎల్‌ఎం) కోసం కూడా వేల మంది పరీక్షలు రాశారు.
ఈ ఏడాది లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యత వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీకి అప్పగించారు. ఈ పరీక్షలను ఆన్లైన్ మోడ్‌లో నిర్వహించగా.. పరీక్షలన్నీ శాంతియుతంగా పూర్తి అయ్యాయి. పరీక్ష తర్వాత జూన్ 11న ప్రాథమిక సమాధానాలు విడుదల చేయగా.. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నేడు తుది ఫలితాలను విడుదల చేశారు.
ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన వారికి కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ ర్యాంక్, కేటగిరీ, జిల్లాల వారీగా కాలేజీలకు ఎంపిక చేసుకోవచ్చు. అధికారిక షెడ్యూల్, హెల్ప్‌లైన్ సెంటర్లు, సీట్ల ఖాళీలు తదితర సమాచారం త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications