తెలంగాణలో మరో 16,946 పోస్టుల భర్తీకి వచ్చే వారంలో నోటిఫికేషన్లు!

హైదరాబాద్: ఇప్పటి వరకు 60 వేలపైచిలుకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. మరో 16 వేలకుపైగా పోస్టులకు మరో మూడు రోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసీఆ్ర ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మరో 16,940 పోస్టులకు కూడా మరో మూడు రోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియామకాల ప్రక్రియలో గడువులు నిర్దేశించుకుని పనిచేయాలని, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎస్.

Telangana: notification will release in next week to fill 16946 posts

వచ్చే నెల (డిసెంబర్)లో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలుగా అవసరమైన సమాచారాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అందించాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

మరోవైపు, రాష్ట్రంలోని భూగర్భ జల వనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. భూగర్భ జలవనరుల శాఖలో 32 గెజిటెడ్, 25 నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+