Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. విదేశాల్లో పని చేయుటకు రిక్రూట్‍మెంట్..

భారత్ నుంచి చాలా మంది విదేశాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ చాలా మంది అరబ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే చాలా మంది బ్రోకర్ల చేతిలో డబ్బులు పెట్టి విదేశాలకు వెళ్లి ఇబ్బంది పడతారు. అక్కడ కంపెనీ గురించి సరైన సమాచారం తెలుసుకోకుండా వెళ్లిన కొద్ది రోజులకే తిరిగి వస్తుంటారు. ఇలా చాలా మంది అప్పుల పాలయ్యారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెట్(TOMCOM) ఏర్పాటు చేసింది.

తాజాగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ , కార్మిక శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ విదేశాల్లో పని చేయడానికి నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. సెమీ స్కిల్ట్ కార్మికులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించాడనికి ఈ రిక్రూట్ మెంట్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరీ, జపాన్, పోలాండ్, రొమేనియా, UK వంటి వివిధ దేశాల్లోని ఏజెన్సీలు ఇక్కడ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నాయి.

hiring for working abroad

అభివృద్ధి చెందిన దేశాలలో మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, ఫిట్టర్లు, JCB డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ సిస్టమ్ టెక్నీషియన్ల వంటి స్థానాలకు నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల TOMCOM అభ్యర్థులకు సురక్షితమైన, చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయం చేస్తుంది. ఆస్ట్రేలియాలోని భారతీయ రెస్టారెంట్లకు HD నిర్వహణ సాంకేతిక నిపుణులు, ఫిట్టర్‌లు, CNC మెషినిస్ట్‌లు, చెఫ్‌ల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

అలాగే, బ్లాస్టర్ పెయింటర్, క్లీనర్, ఫోర్‌మాన్-బ్లాస్టింగ్, పెయింటింగ్, ఫోర్‌మాన్ ప్లేటర్, GTAW వెల్డర్, ITV డ్రైవర్, మెషినిస్ట్-CNC, పైప్ ఫిట్టర్, ప్లేటర్ ఫ్యాబ్రికేటర్, స్కాఫోల్డర్‌లు, సెక్యూరిటీ సిస్టమ్స్ టెక్నీషియన్, సీనియర్ ఆఫీసర్-ఆపరేషన్స్, ఒరాకిల్ ఫంక్షనల్ లీడ్, ఒరాకిల్ టెక్నికల్ లీడ్ , అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ మేనేజర్ UAEలో పని చేయడానికి ఉద్యోగ నియామకాలు చెపడుతున్నారు.

hiring for working abroad

ఎంపిక చేసిన అభ్యర్థులకు TOMCOM ఆహారం, వసతి, చేరిక టిక్కెట్లను అందిస్తుంది. సంబంధిత పనిలో అనుభవం కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండి పాస్‌పోర్ట్‌ ఉన్నవారు TOMCOM వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా hrm-tomcom-let@telanganaకి వారి రెజ్యూమ్‌ని ఇ-మెయిల్ చేయవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+