తెలంగాణ పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ ఇదే, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
మరోవైపు, తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన టెట్ పరీక్షలకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అభ్యర్థులు ఉత్తీర్థత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications