SI Exams: ఎస్సై మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల.. ఎలా డౌన్‍లోడ్ చేసుకోవాలంటే..!

తెలంగాణలో ఈ నెల 8,9 తేదీల్లో జరగబోయే ఎస్సై పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు విడుదల చేసింది. హాల్ టికెట్లను టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి ఉంచారు. ఎస్సై మెయిన్స్ క్వాలిఫై అయి, ఫీజికల్ టెస్టులో అర్హత సాధించిన వారు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎస్సై మెయిన్స్ రాసే అభ్యర్థులంతా సోమవాం నుంచి నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఎవరికైనా హాల్ టికెట్ డౌన్ లోడ్ కాకుంటే 9393711110, 9391005006 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. హాల్ టికెట్ ను ఏ4 సైజ్ పేపర్ ప్రింట్ తీసుకోవాలని పోలీస్ నియామక బోర్డు పేర్కొంది.

telangana SI exams hall tickets realsed in www.tslprb.in

హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలని స్పష్టం చేసింది. ఫొటో గుర్తింపు లేని వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించారని తెలిపింది. ఎస్సై పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో ఏర్పాటు చేశారు. మొత్తం 587 పోస్టులకు గానూ తొలుత 2 లక్షల 47వేల 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య ఫలితాల అనంతరం వీరిలో 59వేల 574 మంది మాత్రమే అర్హత సాధించారు.

అంటే ఒక్కో ఉద్యోగానికి 101 మంది వరకు పోటీలో ఉన్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్‌ విభాగంలోనే 554 పోస్టులు ఉన్నాయి. వీటి కోసం 52 వేల 786 మంది ప్రస్తుతం పోటీలో ఉండటంతో ఈ విభాగంలో ఒక్కో పోస్టుకు 95 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 179 మంది చొప్పున.. పోలీస్‌ రవాణా విభాగంలో 311 మంది అభ్యర్థులు, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 240 మంది చొప్పున పోటీ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+