తెలంగాణ ఆయూష్‌ విభాగంలో 156 కీలక పోస్టుల భర్తీ: 7 నుంచి దరఖాస్తులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో వందకుపైగా ఉద్యోగాల భర్తీ కానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయూష్ విభాగంలో 156 మంది వైద్యాధికారుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 54 మంది ఆయుర్వేద, 33 మంది హోమియో, 69 మంది యునానీ వైద్యాధికారులను నియమించనున్నారు.

ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆగస్టు 7 నుంచి 22వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సేవల రిక్రూట్‌మెంట్ బోర్డ్ సూచించింది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, గతంలో ప్రభుత్వ సర్వీసులో అందించిన సేవలను నియామకానికి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గరిష్ట వయసు ఈ ఏడాది జులై ఒకటో తేదీనాటికి 44 ఏళ్లు ఉండాలి.

Telangana state Ayush department announces 156 job openings

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న
190 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారికి పదోన్నతులు కల్పించారు.

ఎన్ఐపీహెచ్ఎం ఆన్‌లైన్ కోర్సు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ బయో సెక్యూరిటీలో మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు వ్యవధి: సెప్టెంబర్ 1 నుచి నవంబర్ 30 వరకు(మూడు నెలలు)
అర్హత: ఏదైనా డిగ్రీ కనీస వయసు: 20 ఏళ్లు.
బోధనా మాధ్యమం: ఇంగ్లీష్
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 10.08.2023

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+