తెలంగాణ టెట్ 2025 షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana TET 2025) షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం వెల్లడించింది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచుతారు.

జులై 22న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, తెలంగాణలో ఏడాదిలో రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత ఏడాది జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగానే గత ఏడాది డిసెంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన టెట్ పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.

Telangana TET schedule released

ఓయూ డిగ్రీ పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్, బీబీఏ, బీఎస్.డబ్ల్యూ. తదితర కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఏప్రిల్ 30వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని స్పష్టం చేశారు.

రూ. 500 అపరాధ రుసుముతో మే నెల 7వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను జూన్ నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+