తెలంగాణ టెట్ ఫీజు భారీగా పెంపుపై అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ రెండ్రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. టెట్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పీజు కంటే రూ.100 పెంచడంపై నిరసన తెలుపుతున్నారు. 2016లో తొలిసారి నిర్వహించిన టెట్ పరీక్షకు రూ.200 ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొంది.
2017లోనూ అదే రుసుం కొనసాగించారు. 2022 జూన్‌లో పరీక్ష ఫీజును రూ.300కి పెంచారు. తాజాగా రాష్ట్రంలో నాలుగో సారి టెట్ పరీక్ష నిర్వహిస్తుండగా రిజిస్ట్రేషన్ ఫీజును రూ.400కి పెంచారు. దీంతో టెట్ దరఖాస్తు చేసేందుకు సిద్ధమైన అభ్యర్థులు ఫీజు పెంపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాయనున్నట్లు అంచనా. రూ.400 ఫీజు ఒక్కసారి చెల్లించి పేపర్-2తో పాటు పేపర్-1 కూడా రాసుకోవచ్చు. అయితే పేపర్-1 మాత్రమే రాసే డీఈడీ అభ్యర్ధులు తాము కూడా రూ.400 ఫీజు చేయడమేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా రాష్ట్ర, జాతీయ స్థాయి ఉద్యోగ పోటీ పరీక్షలైనా, ప్రవేశ పరీక్షలైనా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన వారికి ఫీజులో కొంత రాయితీ ఉంటుంది. అయితే, టెట్ పరీక్షకు మాత్రం ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదు. ఫీజులు భారంగా ఉన్నాయని, కనీసం ఈసారైనా ఫీజు తగ్గించాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వివరాలు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా.. టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
రాతపరీక్ష: సెప్టెంబర్ 15
పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in ను సంప్రదించవచ్చు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications