తెలంగాణ టెట్ దరఖాస్తులు ప్రారంభం, సెలబస్ ఇదే

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)కు దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా https://tstet2024.aptonline.in/tstet/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ ఆధారిత టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3 మధ్య రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనున్నాయి. మే 15 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల చేస్తారు.

telangana tet applications started from today

టెట్ ఒక పేసర్ రాసేందుకు రూ. 1000, రెండు పేపర్లు రాసేందుకు రూ. 2 వేలు చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. టెట్ పేపర్-1 రాసేందుకు డీఈడీ, పేపర్-2 రాసేందుకు డిగ్రీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలి.

కాగా, 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ(DSC) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

మొత్తం ఉద్యోగాల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు ఉన్నాయి. ఇంకా, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా, ఆ తర్వాత ఖమ్మంలో 757, నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

టెట్ 2024 సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+