తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత (TET) షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం.. రెండు సెషన్లుగా పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి టెట్ పేపర్-1, పేపర్-2లకు కలిపి సుమారు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

టెట్ పేపర్-1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్-2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2వ తేదీన ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్(పేపర్-2) పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 5న ఉదయం సెషన్‌లో సోషల్ స్టడీస్(పేపర్-2), మధ్యాహ్నం సెషన్‌లో మ్యాథమేటిక్స్ అండ్ సైన్స్(పేపర్-2) పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్.. మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 7 న ఇంగ్లిష్ పేపర్-1, మార్చి 11న గణితం పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, మార్చి 13న గణితం పేపర్-2బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, మార్చి 17న ఫిజిక్స్-1, జువాలజీ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, మార్చి 19న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, మార్చి 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు గణితం పేపర్-1, మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్ సెకండియర్ షెడ్యూల్
మార్చి 06న సెకండ్ లాంగ్వేజ్
పేపర్-2, మార్చి 10న ఇంగ్లిష్ పేపర్-2, మార్చి 12న గణితం పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2, మార్చి 15న గణితం పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2, మార్చి 18న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 20న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, మార్చి 22న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు గణితం పేపర్-2, మార్చి 25న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications