నేటి నుంచి ఏపీలో టెట్ 2024 ప‌రీక్ష‌లు..ఇవి త‌ప్ప‌నిస‌రి...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేటి నుంచి టెట్ 2024 ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 21వ తేది వరకు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ ప‌రీక్ష‌లు ఉంటాయి. మొద‌టి సెష‌న్ ఉద‌యం 9.30 నుంచి మధ్యాహ్నం12గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. రెండో సెష‌న్ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. సిబిటీ విధానంలో ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స‌కాలంలో ప‌రీక్షా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు త‌మ‌తో పాటు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్‌లో ఏమైనా తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోనే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ఈసారి టెట్ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఈ సారి ఎక్కువ మొత్తంలో ద‌ర‌ఖాస్తులు రావ‌డంతో అభ్య‌ర్థుల‌కు ఇతర రాష్ర్టాల్లోకూడా ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇత‌ర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 108 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీలోని జిల్లాల‌తో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌, గంజాంలలోనూ కూడా ఏపీ టెట్ ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెట్ అభ్యర్థులు చాలావరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ సారి మెగా డీఎస్సీ క్ర‌మంలో టెట్‌కు భారీగా దరఖాస్తులు వ‌చ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది అభ్య‌ర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ ప‌రీక్ష‌లు రాసేందుకు అర్హ‌త ఉంటుంది. అలాగే, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే విష‌యం అందరికీ తెలిసిందే.

Tet 2024 exams in AP from today these must be

ఇవి త‌ప్ప‌నిస‌రి...

అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్య‌ర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలు తీసుకెళ్ల‌కూడ‌దు. హాల్‌ టికెట్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే పరీక్షా కేంద్రంలో డిపార్ట్‌మెంటల్‌ అధికారి వద్ద సరిచేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. పరీక్షలు జ‌రిగ‌న మ‌రుస‌టి రోజు నుంచే అంటే అక్టోబర్‌ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 5వ తేది నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 27వ తేదిన టెట్ తుది కీ విడుదల చేస్తారు. నవంబర్‌ 2న ఏపీ టెట్ - 2024 రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఇత‌ర పూర్తి స‌మ‌చారం కోసం, హాల్‌టిక్కెట్ల కోసం ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్‌ను https://aptet.apcfss.in/# సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+