ఎస్ పాలిసెట్ దరఖాస్తులకు నేడే చివరితేది.. త్వరగా అప్లయ్ చేసుకోండి..!
తెలంగాణ పాలిసెట్ దరఖాస్తుల గడువు నేటితో (ఏప్రిల్ 28) ముగియనుంది. కాబట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ, ట్రైనింగ్ బోర్డు దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను https://polycet.sbtet.telangana.gov.in/ స‌్పందించగలరు.
ఈ ప్రవేశ పరీక్షకు అప్లయ్ చేయాలనుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ. 250, ఇతరులు రూ. 500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు. టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 24వ తేదీన జరగనుంది. రాత పరీక్ష నిర్వహించిన పన్నెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇతర ముఖ్యమైన వివరాలివే..
2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ పరీక్షను నిర్వహిస్తారు.ఈ పరీక్షకు అప్లయ్ చేయాలనుకునే అభ్యర్థులు రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
వచ్చే నెల 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ - https://polycet.sbtet.telangana.gov.in/ సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.
పరీక్ష విధానం..
టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు పార్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్-60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్ మార్క్స్ ఉండవు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications