Jobs: నెలకు రూ. 1.5 నుంచి రూ. 1.8 లక్షల జీతం..!
విదేశాల్లో పని చేయడం కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (Tomcom) నియామకాలు చేపడుతోంది. తాజాగా జపాన్‌లో పనిచేయడానికి స్టాఫ్ నర్సులను నియమించుకోవడానికి తెలంగాణ అభ్యర్థులకు శిక్షణ, ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జపాన్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (SSW) పథకం కింద, TOMCOM విద్య, శిక్షణ అవకాశాలను అందిస్తోంది. ఆ తర్వాత జపాన్ ఆరోగ్య రంగంలో సురక్షితమైన నియామకాలు చేపట్టనుంది.
శిక్షణ పొందాలనుకునేవారు గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఇంటర్మీడియట్, జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ (GNM) డిప్లొమా, ఆక్సిలరీ నర్స్, మిడ్‌వైఫ్ (ANM), లేదా పారామెడికల్ చేసి ఉండాలి. వయస్సు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేయడానికి ముందస్తు పని అనుభవం అవసరం లేదు. దీంతో చాలా మంది ఈ శిక్షణకు అర్హత సాధించే అవకాశం ఉంది. ఎంపికైన 50 మందికి హైదరాబాద్‌లోని వృత్తిపరమైన నైపుణ్యాల కోసం జపనీస్ భాషలో సమగ్ర శిక్షణ ఇస్తారు.

భాష శిక్షణ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు రూ. 1.5 నుంచి రూ. 1.8 లక్షల వరకు జీతం వస్తుంది. కొద్ది రోజుల క్రితం టామ్ కామ్ దుబాయ్ లో డెలివరీ బాయ్ గా పని చేసేందుకు నియామకాలు చేపట్టింది. అక్టోబర్ 17, గురువారం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్వేత హోటల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. దుబాయ్‌లో బైక్ రైడర్‌లకు, ముఖ్యంగా డెలివరీ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో నియామకాలు చేపట్టారు. టామ్ కామ్ ఆధ్వర్యంలో భవిష్యత్ లో కూడా నియామకాలు ఉంటాయని చెబుతున్నారు.
జులైలో TOMCOM, జర్మనీ ప్రభుత్వం ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ మధ్య కొనసాగుతున్న 'ట్రిపుల్ విన్ పార్టనర్‌షిప్'లో భాగంగా జర్మనీలో రిక్రూట్ అయ్యే నర్సుల కోసం జర్మన్ భాషా శిక్షణ కోసం ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications