గురుకులాల్లో టీజీటీ సహా పలు పోస్టులకు పరీక్షలు: ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి మంగళవారం ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 104 కేంద్రాల్లో మొదలయ్యే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆగస్టు 1 నుంచి పరీక్షలు జరగనున్న క్రమంలో అభ్యర్థులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్, పొటో తీసుకుంటారు. అభ్యర్థులందరూ తమకు సూచించిన సమయంలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఈ పరీక్షలు మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిప్టుల్లో జరుగుతాయి.

ప్రతి పరీక్ష సమయం రెండు గంటలు. మొదటి షిప్టులో ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, మూడో షిప్టు పరీక్ష సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు జరుగుతుంది. ప్రతి షిప్టు పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించరు.
పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. గుర్తింపు కార్డు లేకుంటే పరీక్ష గదిలోకి అనుమతించరు. హాల్ టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకుంటే.. మూడు పాస్‌పోర్ట్ సైజ్ పొటోలపై గెజిట్ అధికారి ధృవీకరణ, అండర్ టేకింగ్ ధృవీకరణ పత్రం తీసుకుని ఇన్విలేజిలేటర్‌కు ఇవ్వాలి. లేకుంటే పరీక్ష కేంద్రంలోకి రానివ్వరు. తనఖీ చేసి గుర్తింపును ధృవీకరించాకే అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతిస్తారు.
కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లతో పరీక్ష గదిలోకి అనుమతించరు. హాల్ టికెట్, గుర్తింపు కార్డ్, నామినల్ రోల్‌లలో ఫొటోలు వేర్వేరుగా ఉన్నా.. అభ్యర్థి వ్యక్తిగత ధృవీకరణ లోపాలు గుర్తించినా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు భద్రంగా ఉంచుకోవాలి.
పరీక్ష పేపర్-1,2,3లో తప్పుగా రాసిన ప్రతి సమాధానానికి పావు(0.25) మార్కు కోత ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి పది నిమిషాల ముందు పాస్‌వర్డ్ చెబుతారు. కంప్యూటర్‌లో దీన్ని నమోదు చేశాక అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు వస్తాయి. పరీక్ష ప్రారంభమయ్యే సమాయానికి స్క్రీన్‌పై ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కంప్యూటర్ ఆటోమేటెడ్‌గా అదనపు సమయం ఇస్తుంది.
కాగా, అభ్యర్థులు తమ వివరాలతో బోర్డ్ వెబ్ సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications