TREIRB Results 2024: టిఎస్ గురుకుల ఉద్యోగాల రిజ‌ల్ట్ విడుద‌ల‌...ఇలా చెక్ చేసుకోండి..

టిఎస్ గురుకుల ఉద్యోగాల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పోస్టుల‌పై సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వీటి ఫ‌లితాల‌పై ఆలస్యం జరిగింది. న్యాయ వివాదం ముగియడంతో తాజాగా ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను గురుకుల నియామ‌క బోర్డు విడుద‌ల చేసింది. తాజాగా గురుకుల నియామక బోర్డు (TREIRB) అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాలను బుధవారం (ఫిబ్రవరి 7) ప్రకటించ‌డం జ‌రిగింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను https://treirb.telangana.gov.in/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

గ‌త సంవ‌త్స‌రం తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో ఒకేసారి తొమ్మిది నియామక ప్రకటనలు జారీ చేసిన సంగ‌తి విదిత‌మే. ఈ పోస్టుల కోసం సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించిన ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు గతేడాది ఆగస్టులో నెలరోజుల పాటు నిర్వహించడం జ‌రిగింది. ప‌రీక్ష‌ల అనంత‌రం ప్రాథమిక, ఫైనల్‌ కీలను బోర్డు ప్రకటించింది. అయితే, అప్ప‌డే తుది ఫలితాలు వెల్లడించాలని అనుకున్న‌ప్ప‌టికీ, సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెల‌కొన‌డంతో ఆ ఫ‌లితాలు వెలువ‌డ‌డంలో ఆల‌స్యం జ‌రిగింది.

TREIRB Results 2024:TS Gurukul jobs result released,how to check

ఇక‌, తాజాగా ఈ వివాదాలు ముగియడంతో మెరిట్‌ జాబితాలను గురుకుల బోర్డు ప్ర‌క‌టించింది. ఈ ఫలితాల్లో ముందుగా సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వీలుగా 1:2 నిష్పత్తితో జాబితాను ప్రకటించింది. పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులకు ఫిబ్రవరి 8న మెరిట్‌ జాబితా వెలువడే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం.త్వ‌రిత‌గ‌తిన‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తిచేసేందుకు గురుకుల బోర్డు భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్‌లోని కొన్ని పోస్టులకు ఈ నెల 9, 10వ తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయాలని గురుకుల బోర్డు యోచిస్తోంది. ఈ రోజు పీజిటి పోస్టుల మెరిట్ జాబితా విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+