నేడే టీఎస్ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల.. ఇలా చెక్ చేసుకోండి..!

నేడు తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుద‌ల కానున్నాయి. ఏప్రిల్‌ 30 (మంగళవారం) ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను విడుదల చేసేందుకు తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు త‌మ హాల్‌టిక్కెట్ నెంబ‌ర్‌తో ప‌రీక్ష ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు. తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://results.bsetelangana.org/ లో పొందుప‌రుస్తారు. అక్క‌డి నుంచి విద్యార్థులు తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష 2024 ఫ‌లితాల‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక‌, ఈ సంవ‌త్స‌రం తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు జరిగిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 5,08,385 మంది విద్యార్థినీ విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశారు. అందులో 2,57,952 మంది బాలురు ఉండ‌గా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాగే మనబడి వెబ్‌సైట్‌ నుంచి కూడా ఫలితాలను చెక్‌ చేసుకోగ‌ల‌రు.

ఈ ఏడాది తెలంగాణలో మొద‌టిసారిగా ప‌దోత‌ర‌గ‌తి మార్కుల మెమోలపై పెన్ (Permanent Education Number) నెంబర్‌ ముద్రించే దిశగా తెలంగాణ విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థులకు పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (PEN)ను అమలు చేయనుంది. ఈ సంవ‌త్స‌రం నుంచే ఈ విధాానాన్ని అమలు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పెన్ నెంబర్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది. ఇందులో విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు కూడా ఉంటాయి. ఈ పెన్ విధానంతో నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. పెన్ నెంబర్‌తో ఒరిజినల్ సర్టిఫికెట్లను సింపుల్ గా గుర్తించొచ్చు.

TS 10th result release today Check this

పదో తరగ‌తి పరీక్షల కోసం రాష్ట్రంలో మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యూయేషన్‌ ప్రారంభించారు. ఏప్రిల్ 13తో టెన్త్ స్పాట్ ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+