ఈ నెల 27 నుంచి టిఎస్ టెట్ అప్లికేషన్లు ప్రారంభం..
ఈ నెల 27 నుంచి తెలంగాణ టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు ముందుగా రాష్ట్రస్థాయిలో నిర్వహించే టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తాజాగా టెట్, డీఎస్సీల నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, టెట్ అప్లికేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. టిఎస్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్-)-2024 అప్లికేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ముందుగా ఫీజు పే చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
తెలంగాణలో ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇక, ఈసారి పరీక్ష ఫీజు కూడా అధికంగా ఉండడంతో టెట్, డీఎస్సీ రాసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో 400 రూపాయలు మాత్రమే ఉండేది. ఒక్కపేపర్ రాసినా రెండు పేపర్లు రాసినా అంతే ఫీజు ఉండేది. కానీ ఇప్పడు అలా లేదు. ఒక్క పేపర్‌కు 1000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. అంటే రెండుపేపర్లకు 2వేల రూపాయలు అన్నమాట. దీంతో టెట్ రాసే అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెట్ నోటిఫికేషన్ కంటే ముందే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వెలువడింది. డీఎస్సీ పరీక్షకు కూడా రూ. 1000 ఫీజు. దీంతో అభ్యర్థులు డీఎస్సీ పరీక్షకు రూ.వెయ్యి చెల్లిస్తున్నామని, మళ్లీ టెట్‌కు అంతే ఫీజు పెట్టడం సరికాదని ఆవేదన చెందుతున్నారు.

ఫీజు విషయలో అభ్యర్థుల నిరసనలు..
ఇక, ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా పలు లైబ్రరీల వద్ద అభ్యర్థులు భారీ ఎత్తున నిరసనలు కూడా తెలిపారు. ఫీజుల పెంపుపై టిఎస్ విద్యాశాఖ స్పందించింది. ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలోనే ఫీజు పెంచాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ మధ్యే జరిగిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉందని అభ్యర్థులు అన్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1,200 ఫీజు వసూలు చేశారు. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతోనే అప్లికేషన్ రుసుము పెంచామని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ట్రిబ్ కంటే రూ.200 తక్కువగానే తీసుకుంటున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications