TSPSC Paper Leak: గ్రూప్-1 మెయిన్స్, ఏఈ పరీక్షలు ఎప్పుడంటే..!

టీఎస్‍పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్, ఏఈ పరీక్ష తేదీలు ప్రకటించింది.

టీఎస్‍పీఎస్సీ(TSPSC) ఏఈ పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 4న ఏఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ లో 22, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో 113 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి సబెక్ట్ నిపుణులతో ప్రశ్నాపత్రాన్ని తయారు చేయిస్తున్నారు.

గ్రూప్ 1 జూన్ 5 నుంచి 12 వరకు

గ్రూప్ 1 జూన్ 5 నుంచి 12 వరకు

ఏప్రిల్ 4 తేదీ ఫైనల్ కాదని.. కొద్ది రోజులు సమయం పట్టవచ్చని.. అభ్యర్థులు సిద్ధంగా ఉండేందుకు తేదీని ప్రకటించామన్నారు. మరోవైపు మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ మన్సిపల్ అడ్నినిస్ట్రేష్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరీక్ష, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహంచే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

సిట్ దర్యాప్తు

సిట్ దర్యాప్తు

మార్చి 5న జరిగిన ఏఈ పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యాతో పాటు మిగిలిన నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీక్ కు వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. నాంపల్లి బీజేపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయల్దేరిన బండి.. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.

బండి సంజయ్

బండి సంజయ్

అయితే బండి సంజయ్ ను దీక్ష ఆపాలని పోలీసులు కోరారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో గన్ పార్క వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్సీఎస్సీ ఏఈ పేపర్ లీక్ పై సీఎం కేసీఆర్ ఇంత వరకు స్పందించకపోవడం బాధకమని బండి సంజయ్ అన్నారు. ఈ విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+