టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్: రూ. 10 లక్షల డీల్, ప్రవీణ్ తోపాటు ముగ్గురి అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో కంప్యూటర్ హ్యాకింగ్ కలకంగా మారింది. ఈ లీకేజీ వ్యవహారంలో టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో కంప్యూటర్ హ్యాకింగ్ కలకంగా మారింది. ఈ లీకేజీ వ్యవహారంలో టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, టీఎస్ పీఎస్సీ ఉన్నతాధికారి సిబ్బందే రూ. 10 లక్షలకు ఆశపడి దళారులతో కలిసి టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష పేపర్లను లీకేజీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణే ఈ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ తోపాటు ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. బేగంబజార్‌లోని పోలీస్ స్టేషన్‌కు టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఇద్దరు నిందితులను తరలించారు. ప్రవీణ్ ల్యాప్‌టాప్ ను స్వాధీనం చేసుకుని, మరింత సమాచారం కోసం ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు పోలీసులు.

 tspsc exam paper leak: accused Praveen and three other arrested.

ముగ్గురు దళారులతో కలిసి ప్రవీణ్ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేపర్ లీకేజీ కోసం దళారులతో ప్రవీణ్ రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు దళారులకు టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ తోపాటు ఆ ముగ్గురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక, ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన పలువురిని కూడా అరెస్ట్ చేశారు.

ప్రశ్నాపత్రం లీకైనట్లు ఓ అభ్యర్థి బేగంబజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీఎస్ పీఎస్సీ ఉన్నతాధికారులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో గుర్తించిన అధికారులు.. వెంటనే టౌన్ ప్లానింగ్, వెటర్నరీ రెండు పరీక్షలను వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+