తెలంగాణ గ్రూప్-4 ప్రాథమిక ‘కీ’ విడుదల, అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన గ్రూప్-4 ప్రాథమిక 'కీ' విడుదలైంది. గ్రూప్-4 ప్రాథమిక కీపై ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది.
ఇక, పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల డిజిటల్ కాపీలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సెప్టెంబర్ 27 వరకు అవి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తెలంగాణ గ్రూప్-4 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) జులై 1న విషయం తెలిసిందే.
తెలంగాణ గ్రూప్-4 పరీక్ష ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో 597 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రూప్-1లో 89 పోస్టులు, గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్స్ పరీక్షలను నిర్వహించనుంది.
597 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, గ్రూప్-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరి-II, అసిస్టెంట్ కమిషనర్(ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఇక, గ్రూప్-2 కేటగిరీలో డిప్యూటీ తహసీల్దార్లు(గ్రేడ్-II), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ IIతోపాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో త్వరలోనే కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏయే విభాగాల్లో ఏయే పోస్టులను భర్తీ చేయనుందో వెల్లడించారు.












Click it and Unblock the Notifications