TSPSC: తెలంగాణ జూనియర్ లెక్చరర్ పరీక్షల తేదీలు ఖరారు: ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మరో ఉద్యోగ పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక రాత పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3వ తేదీ వరకు జరగనున్నాయి.
సుమారు 1392 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సెషన్‌లో సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్ష జరగుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను తాజాగా, విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి. 2008లో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో (2008) 1100 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య కంటే అధికంగా 1392 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
సబ్జెక్టుల వారీగా ఆయా పరీక్షల తేదీలు:
ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 12, 2023
ఆర్థికశాస్త్రం, వృక్షశాస్త్రం పరీక్ష తేదీ: సెప్టెంబర్ 13, 2023
మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 14, 2023
కెమిస్ట్రీ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 20, 2023
తెలుగు పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 21, 2023
భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం పరీక్ష తేదీ: సెప్టెంబర్ 22, 2023
కామర్స్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 25, 2023
సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 26, 2023
హిందీ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 27, 2023
హిస్టరీ, సంస్కృతం పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 29, 2023
ఉర్దూ పరీక్ష నిర్వహించే తేదీ: అక్టోబర్ 3, 2023. ఈ అన్ని పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల త్వరలోనే టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications