గ్రూప్-4 పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూత: టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు
హైదరాబాద్: గ్రూప్-4 పరీక్ష జులై 1న జరగనున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. జులై 1న జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. శనివారం నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.
భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ రక్షణ కోసం పలు చర్యలతోపాటు వేలిముద్రను తప్పనిసరి చేసింది. నామినల్ రోల్‌లో సంతకం తర్వాత ఎడమచేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించింది. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలి. అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తు చేస్తూ బెల్ మోగిస్తారు.

పరీక్ష ముగియడానికి 5 నిమిషాల ముందు బెల్ మోగిస్తారు. అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలు మార్క్ చేయకూడదని తెలిపింది. పేపర్-1(జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2(సెక్రటేరియట్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పేపర్-1కు ఉదయం గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారు.
కాగా, అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు పొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతోపాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రం గేట్లు మేసివేస్తారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో రావాలని కమిషన్ కోరుతోంది. అభ్యర్థులను తనిఖీ తర్వాతే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన నిషేధిత వస్తువులు తీసుకురావద్దని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, షూ వేసుకోవద్దని తెలిపింది. గ్రూప్-4 ఓఎంఆర్ పత్రంలో హాల్ టికెట్, ప్రశ్నపత్రం నెంబర్, పరీక్ష కేంద్రం కోడ్, అభ్యర్థి పేరుతోపాటు సంతకం చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications