తెలంగాణలో 1540 ఏఈఈ పోస్టల భర్తీకి నోటిఫికేషన్: మంచి జీతం, అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కారు నుంచి మరో శుభవార్త అందింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో 1540 సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ విభాగాల్లో ఇంజినీరింగ్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులతో ఈ ఉద్యోగులను భర్తీ చేయనుంది.
ఈ ప్రకటనలో అత్యధికంగా సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ సూచించారు. పోస్టుల వారీగా పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన విద్యార్హతలను సెప్టెంబర్ 15న కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ తదితర) విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 44 యేళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 14, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 22, 2022 నుంచి ప్రారంభమవుతాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
ఏఈఈ(సివిల్)- పీఆర్ అండ్ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ (మిషన్ భగీరథ) పోస్టులు: 302
ఏఈఈ(సివిల్)- పీఆర్ అండ్ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 211
ఏఈఈ (సివిల్) ఎంఏ అండ్ యూడీ- పీహెచ్ పోస్టులు: 147
ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 15
ఏఈఈ ఐ అండ్ సీఏడీ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 704
ఏఈఈ (మెకానికల్) ఐ అండ్ సీఏడీ(జీడబ్ల్యూడీ) పోస్టులు: 3
ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బి పోస్టులు: 145
ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్ అండ్ బి పోస్టులు: 13.
ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ను సంప్రదించండి.












Click it and Unblock the Notifications