తెలంగాణ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో 833 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో 833 సహాయ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ అధికారుల పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. విభాగాలు, పోస్టుల వారీగా ఖాళీలకు సంబంధించి పూర్తి ప్రకటన సెప్టెంబర్ 23న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. ఇతర వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ సంప్రదించవచ్చన్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు
సహాయ ఇంజినీర్లు: 434
మిషన్ భగీరథ-62
పంచాయతీరాజ్-41
పురపాలన-13
మున్సిపల్ సహాయ ఇంజినీర్-29
మున్సిపల్ టెక్నికల్ అధికారి-9
గిరిజన సంక్షేమం-3
నీటి పారుదల -227
భూగర్భజల-12
రోడ్లు, భవనాలు-38
జూనియర్ టెక్నికల్ అధికారులు: 399
మిషన్ భగీరథ-27
పంచాయతీరాజ్-68
పురపాలన-32
నీటిపారుదల-212
రోడ్లు, భవనాలు-60
ఇతర వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ సంప్రదించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications